Site icon NTV Telugu

CPI Ramakrishna : ప్రభుత్వంలో పోలీసులే రాజ్యం ఏలుతున్నారు

CPI Ramakrishna Fired On YCP Government.

ఆదోని ఆసుపత్రిలో పోలీసుల దాడి బాధితులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్జ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకు పోయిందని, ప్రభుత్వంలో పోలీసులే రాజ్యం ఏలుతున్నారన్నారు. పోలీసులకు డ్రస్ ఇచ్చింది దౌర్జన్యం చేయడానికా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, విజయవాడలో అఖిలపక్ష సమావేశం లో సమస్యను లేవనెత్తుతామన్నారు. ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తుంటే పోలీసు ఉన్నత అధికారులు ఏంచేస్తున్నారన్నారు. మునిప్రతాప్ ఎస్సైగా ఎలా కొనసాగుతాడని, సీపీఐ నాయకులపై దౌర్జన్యం చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్టేషన్ కెళ్ళి న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టడం దారుణమని, నంద్యాలలో నలుగురు ముస్లిం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని, జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి 25 మంది చనిపోయారన్నారు.

అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వలన విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ పిచ్చివాడయ్యాడని, రాష్ట్రంలో పోలీసులు బెదిరిస్తూ చంపే పనులు మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చి వెంటనే చర్య తీసుకోవాలని, ఎస్సై మునిప్రతాప్‌ను విధుల నుండి వెంటనే తొలగించాలని, రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందా… పోలీసుల రాజ్యం ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం చెప్పాలని, బాధితులకు న్యాయం జరగకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

https://ntvtelugu.com/tdp-mlas-going-to-jangareddygudem/
Exit mobile version