CPI Narayana: మూడు రాజధానులు అనేది వైసీపీ సర్కారు ఉద్యమం మాత్రమే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17 దేశాల ప్రతినిధులతో వామపక్ష పార్టీల బలోపేతంపై చర్చించామని తెలిపారు.
Read Also: Vidadala Rajini: జనసేన కార్యకర్తలు కావాలనే దాడి చేశారు.. ఎవరినీ వదిలిపెట్టం..!!
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
అటు అమరావతి రాజధానిగా ఉండాలని, మోదీ ఆర్థిక విధానాలపై వ్యతిరేకంగా 24వ జాతీయ మహాసభల్లో తీర్మానాలు చేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ కంటే తాము ముందుగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీకి ప్రస్తుతం రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని.. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేది సర్కార్ ఉద్యమం అన్నారు. అధికార పార్టీ నాయకులు భూదోపిడీదారులు అని నారాయణ తీవ్రంగా ఆరోపించారు. కాగా ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్‌కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని.. అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!