Site icon NTV Telugu

CPI Narayana: బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం

Cpi Narayana

Cpi Narayana

CPI Mahasabha: సీపీఐ తిరుపతి జిల్లా తొలి మహాసభలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఇవాళ, రేపు జరగనున్నాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇందిరా మైదానం వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, తదితరులు పాల్గొ్న్నారు. సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరిగింది.

బీజేపీ ఏకచత్రాధిపత్యానికి బీహార్‌లో గండి పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం పేరిట జెండా దోపిడీకి మోడీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. ఖాదీ జెండాలనే వాడేలా చేసి ఉంటే చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదన్నారు. మోడీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని విమర్శించారు.

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఆవిర్భావం

ఆగస్ట్ 26 నుంచి మూడురోజుల పాటు విశాఖలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై చర్చించి తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయ నేతల్లో నైతికత లేకుండా పోతోందన్నారు. దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ, అసభ్యకరమైన వీడియో చూపించిన ఎంపీని సీఎం జగన్ వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు. గోరంట్ల మాధవ్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి కులం పేరిట విమర్శలు తగదన్నారు. తన పార్టీ నేతల నీచ చేష్టలపై సీఎం నోరు విప్పకపోవడం దారుణమన్నారు.

Exit mobile version