Site icon NTV Telugu

Ramakrishna: వైఎస్సాఆర్ ఆశయానికి జగన్‌ మంగళం..!

ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్‌ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read Also: Yadadri Temple: యాదాద్రిలో మళ్లీ మరమత్తులు

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయ‌న ప్రశ్నించారు. రైతులు బిల్లులు చెల్లించాక, తదుపరి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారని అన్నారు. అసలు మీటర్లు బిగించటం, బిల్లులు తీయటం, రైతులకు తిరిగి ఖాతాల్లో జమ చేయటం వంటి తతంగం ఎందుకు అని కె. రామకృష్ణ నిలదీశారు. ఇదంతా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు జగన్ సర్కార్‌సై అంటూ అమలుకు పూనుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీపీఐ తరపున రామకృష్ణ డిమాండ్ చేశారు.

Exit mobile version