CPI Leader Ramakrishna: హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనక ఎవరున్నారన్నారని సందేహం వ్యక్తం చేశారు.
Weather Update: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు!
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ పకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ అన్నట్లు తేల్చారని మండిపడ్డారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ అంటూ ఆరోపించారు. అనంతబాబు కేసులో పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
