NTV Telugu Site icon

CPI Narayana: బిగ్‌బాస్‌ను బ్యాన్ చేసే వరకు నా పోరాటం ఆగదు

Narayana

Narayana

CPI Narayana: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ప్రముఖ హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘీక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను స్వీకరించలేదని నారాయణ వెల్లడించారు.

Read Also: Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్‌

అయితే బిగ్‌బాస్ షో విషయంలో తన విన్నపాన్ని ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని సీపీఐ నేత నారాయణ తెలిపారు. ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇప్పటికే బిగ్‌బాస్ షోపై దాఖలైన పలు పిటిషన్‌లను ఏపీ హైకోర్టు విచారించిందని గుర్తుచేశారు. కాగా బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ కార్యక్రమాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా కూడా ఆయన అభివర్ణించారు. అయితే నారాయణకు హోస్ట్ నాగార్జున కూడా పలు సందర్భాలలో కౌంటర్లు వేశారు. రోహిత్-మెరీనా ముద్దు విషయంలో నారాయణ నారాయణ వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. ఇది తప్పు కాదు అంటూ ప్రస్తావించారు.