ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను అసలు గౌరవించడం లేదన్న నారాయణ.. ప్రేక్షక పాత్ర వహించకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని లేదంటే రాష్ట్రాల మధ్య జలవివాదాలు వస్తాయన్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులను మోహరించారని గుర్తు చేసిన నారాయణ.. ఇది దేశ సరిహద్దుల వాతావరణాన్ని తలపిస్తోందని.. చోధ్యం చూడకుండా కేంద్రం జోక్యం చేసుకుని వివాదాలను పరిష్కరించాలని కోరారు.
సీఎంలు జల వివాదాల్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు..!

Narayana