NTV Telugu Site icon

విశాఖలోనూ న్యూయర్‌ వేడుకలపై ఆంక్షలు: మనీష్‌ కుమార్‌ సిన్హా

న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ సహ కొన్ని నగరాల్లో కోవిడ్‌ దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా విశాఖనగరంలోనూ కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. వేడుకలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. డిసెంబర్ 31న యారాడ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు.

Read Also:రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త

నగర పరిధిలో ఉన్న ఫ్లైఓవర్‌లను కూడా సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేస్తున్నట్టు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రెసింగ్ లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంత ఇళ్ల వద్దే ఉండి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సీపీ కోరారు.