Site icon NTV Telugu

తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా…

తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అయితే దీనిని భజరంగ్ ధళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బైపాస్ లలో 300, 500 చిల్లరకు ఆశపడి లారీలను వదిలేస్తున్నారు కొందరు పోలీసులు. పది గోవులు తరలించాల్సిన లారీలో 50కి పైగా తరలిస్తున్నారు అక్రమార్కులు. మెడలు విరిచి లారీలో కుక్కి అత్యంత క్రూరంగా తరలింపుకు యత్నం చేస్తున్నారు. ఊపిరాడక కొన్ని మూగజీవాలు అందులో చనిపోతున్నాయి. చంద్రగిరి, నిన్న తిరుచానూరులో లారీలను అడ్డుకున్న హిందూ సంఘాలు… అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

Exit mobile version