విశాఖ జిల్లాలో సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో యజమానులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్లను నడపలేం అంటున్నారు యజమానులు. ఇప్పటికే కరోనా వల్ల దివాలా తీశామని, ప్రభుత్వం విధించే ఆంక్షలతో థియేటర్లు మూసివేయడమే శరణ్యం అంటున్నారు.
సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు
