ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒక్కోసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం 2 వేల వైపు పరుగులు పెడుతూనే ఉంది.. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌కు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచలన మేరకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, తనను ఇటీవల కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, అంతా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ పయ్యావుల కేశవ్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
Read Also: మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం