ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్టేనా..? మహమ్మారి మాయం అయినట్టేనా? అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నే.. అయితే, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.. ఎందుకంటే..? ఈరోజు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక నిల్ కేసులు నమోదు కాకపోవడం ఇదే తొలిసారి కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. అయితే, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏపీని కరోనా ఫ్రీ స్టేట్ ప్రకటించవచ్చు అని చెబుతున్నారు.
Read Also: Minister Amarnath: పవన్ కల్యాణ్-అమర్‌నాథ్ ఫొటో వైరల్.. మంత్రి ఫన్నీ కామెంట్స్..