Couple Married Who Met Through Facebook in Andhra Pradesh: ఆ ఇద్దరు ప్రేమికులు. ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. అమ్మాయి తరఫు బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో, వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరుకు చెందిన సంకుల గాయత్రి, మంగళగిరిలోని ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి ఓ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం ఆ ఇద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించుకున్న తర్వాత చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి అభిరుచులు కలిశాయి. మనసులు కూడా కలిసిపోయాయి. ఇలా రెండున్నరేళ్లు ప్రేమించుకున్న వాళ్లిద్దరు.. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Sidhu Moose Wala: పంజాబ్ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం
అయితే.. తమది కులాలు వేరు కావడంతో పెద్దలు కచ్ఛితంగా అంగీకరించరన్న విషయం గాయత్రి, గణపతి గ్రహించారు. దీంతో.. పెద్దలకు తెలియకుండా వారిద్దరూ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం గాయత్రి కుటుంబ సభ్యులకు తెలిసింది. తమకు తెలియకుండా, అది కూడా వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లు కోపంతో రగిలిపోయారు. ఆ కోపంలోనే ఇద్దరిని చంపేస్తామంటూ బెదిరించారు. దాంతో భయబ్రాంతులకు గురైన ఆ కొత్త జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించారు. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, అయితే తమ పెళ్లిని గాయత్రి కుటుంబ పెద్దలు అంగీకరించడం లేదని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి పెద్దల్ని పిలిచి, ఈ వ్యవహారం పరిష్కారం అయ్యేలా మాట్లాడుతామని పోలీసులు భరోసా కల్పించారు.
Aamir Khan: మహేశ్ సినిమాలో ఆమిర్ ఖాన్.. డైరెక్టర్ వేసిన మాస్టర్ స్కెచ్?