Site icon NTV Telugu

PSLV C-52: మొదలైన కౌంట్‌డౌన్.. ఈ ఏడాది తొలి ప్రయోగం..

పీఎస్‌ఎల్‌వీ సీ- 52 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది… కోవిడ్‌ మహమ్మారి పలు ప్రయోగాలపై ప్రభావం చూపగా.. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చాలా రోజుల తర్వాత రాకెట్ ప్రయోగానికి రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పటికే PSLV C-52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్‌ మొదలైంది… 25 గంటల 30 నిముషాల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్‌ ప్రయోగించనున్నారు.. ఇక, శ్రీహరికోటలో ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డా. ఎస్ సోమ్‌నాథ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు..

Read Also: Astrology: ఫిబ్రవరి 13, ఆదివారం దినఫలాలు

కోవిడ్ సవాళ్లను అధిగమించి ఈ ఏడాదిలో తొలి ప్రయోగం సోమవారం జరగరబోతోంది.. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇవాళ వేకువజామున 4.29 గంటలకు ప్రారంభించారు.. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్‌-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలు.. అంటే మొత్తంగా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది పీఎస్‌ఎల్‌వీ సీ-52.

Exit mobile version