మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక మర్గం వ్యాక్సినేషన్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఆగిపోయే పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న మొత్తం వ్యాక్సినేషన్‌ను పంపిణీ చేశారు వైద్య సిబ్బంది.. దీంతో.. కేంద్రం వ్యాక్సిన్ డోసులు పంపేవరకు వేచిచూడాల్సిన పరిస్థతి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు సిబ్బంది.. దీంతో.. ఏపీలో జీరోకు పడిపోయాయి వ్యాక్సిన్ నిల్వలు.. మరోవైపు.. మరిన్ని డోసులు కావాలంటూ కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం… ఒకటిరెండు రోజుల్లో రెండు మూడు లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి వైద్యారోగ్య శాఖ వర్గాలు. అంటే, ఇప్పుడు.. వ్యాక్సిన్ నిండుకోవడంతో.. కేంద్రం మరిన్ని డోసులు పంపించే వరకు వేచిచూడాల్సిందే అన్నమాట. ఓవైపు.. టీకా ఉత్సవ్ అంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాల అవసరాల మేరకు కూడా వ్యాక్సిన్ పంపించే ఏర్పాట్లు చేయలేదని విమర్శలు ఉన్నాయి.. ఇక, కోవిడ్ వ్యాక్సిన్ల కొరతకు చెక్ పెట్టేందుకు మరికొన్ని కొత్త వ్యాక్సిన్లకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో నో వ్యాక్సినేషన్..! జీరోకు నిల్వలు..
vaccine