ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు.
Read Also: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి ఫైర్
గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 3,913 మంది సంపూర్ణంగా కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,21,00,381 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 78 , 513 లక్షలకు చేరింది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
