NTV Telugu Site icon

Nellore District: కలకలం రేపుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి వివాదం

Mekapati Wife

Mekapati Wife

Nellore District: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వివాదం కలకలం రేపుతోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. ఇటీవల తనకు కొడుకు ఎవరూ లేరని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘నేను ఎవరిని?’ అంటూ శివచరణ్ రెడ్డి ఒక లేఖను విడుదల చేయడంతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను విడుదల చేశారు. శివ చరణ్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. దీంతో శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి స్పందించారు.

Read Also: Adilabad Safe District: ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా

రెండేళ్ల పాటు తన చుట్టూ తిరిగి బెంగళూరులో 18 ఏళ్ల పాటు కాపురం చేసి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనను వదిలిపెట్టారని లక్ష్మీదేవి ఆరోపించారు. శాంతి కుమారి పరిచయం అయిన తర్వాత శేఖర్ రెడ్డిలో మార్పు వచ్చిందని ..ఆమె వల్లే తమకు దూరంగా శేఖర్ రెడ్డి ఉన్నారని లక్ష్మీదేవి వెల్లడించారు. డబ్బులు.. ఆస్తులు కోసమే తాము ఆరోపణలు చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి మాటలతో అవమానం భరించలేక ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చిందన్నారు. తమకు సొంత ఇల్లు కూడా లేదని.. శాంతకుమారి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అటు ఇటీవల తనకు ఆస్తి ముఖ్యం కాదని.. గుర్తింపు కావాలని కోరుకుంటున్నానని శివచరణ్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.