NTV Telugu Site icon

Kanipakam Temple EO: నూతన ఈవో నియామకంపై రగడ

Kanipakam eo

93f4c800 A2a2 47cb 8eb9 F538e425484e

కాణిపాకం ఆలయం దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్నది. అక్కడికి రోజూ వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వినాయకుడు సత్య ప్రమాణాలకు ఫ్యామస్. రాజకీయనాయకులు కూడా అక్కడ ప్రమాణాలు చేస్తుంటారు. తాజాగా కాణిపాకం ఆలయ కేంద్రంగా మరో వివాదం రాజుకుంది. నూతన ఇవో నియామకంపై రగడ జరుగుతోంది. ఆర్జేసీ కేడర్ అధికారికి ఇవ్వాల్సిన ఇవో పోస్ట్ ను సూపరింటెండెంట్ కేడర్ అధికారికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు పోస్టుల్లో ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు నూతన ఇవో రాణాప్రతాప్.

ఆర్జేసీ స్థాయి అధికారులున్నా గెజిటెడ్ సూపరింటెండెంట్ కి అదనపు బాధ్యతలు అప్పగించడం ఏంటని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ డిప్యూటీ కమీషనర్ గా అదనపు బాధ్యతల్లో రాణాప్రతాప్ కొనసాగుతున్నారు. తాజాగా కాణిపాకం ఆలయ ఇన్ చార్జ్ ఇవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ నియామకంపై విమర్శలు వస్తున్నాయి. అంతకుముందు కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ల ధరలు పెంచేశారు. దేవాదాయశాఖకు తెలియకుండా అప్పటి ఈవో సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సీరియస్ అయింది. ఆయనపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం.

Read Also: Flipkart Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

సాధారణంగా అభిషేకం సేవా టికెట్ ధర 750 రూపాయలే. కానీ ఈవో సురేష్ బాబు ఆలయ పాలకమండలితో చెప్పకుండానే ధరను ఏకంగా 5 వేలకు పెంచారు. అంతేకాదు పెంచిన టికెట్ ధరలపై ఏకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆలయ పాలకమండలికి షాకిచ్చారు. అభిషేకం టికెట్ ధరల పెంపుపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈవో జారీచేసిన నోటిఫికేషన్ రద్దుచేసి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈవో సురేష్ బాబు స్థానంలో పూర్తిస్థాయి ఈవోకి బదులుగా రాణాప్రతాప్ ని నియమించింది ప్రభుత్వం.

Read Also: Snakes in Pants: ప్యాంట్‌లో పాములు.. ఏందయ్యా ఇది!

Show comments