Contractors Protest: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్ నీటి పైప్ లైన్ పనులను కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. నెల్లూరుకు చెందిన కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని స్థానిక కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని కాంట్రాక్టర్ బాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ మండిపడ్డారు. కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని స్థానిక కాంట్రాక్టర్ల పేర్కొన్నారు. ఇప్పటికైనా, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: HHVM : హరిహార వీరమల్లు నష్టాలు.. తిరుగుబాటుకు రెడీ అవుతున్న బయ్యర్స్
అయితే, హైదరాబాద్ లోని కేఎల్ ఎస్సార్ కంపెనీ వారి ఆఫీసుకు వెళ్తే డబ్బులు ఇవ్వము చంపేస్తామని బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ కొండ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పైప్ లైన్ ముందు పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
