NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్..!

Tirumala

Tirumala

తిరుమల తిరుపతి దేశస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. కాగా.. నిన్న ( శనివారం ) స్వామివారిని 88,626 మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read Also: John Kaczynski: 17 ఏళ్లలో 16 పేలుళ్లు.. జైల్లోనే చనిపోయిన అమెరికా క్రూర నేరస్థుడు

అయితే నిన్న ( శనివారం ) శ్రీవారికి 51,379 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా ఇవాళ (ఆదివారం) సెలవుదినం కావడంతో పాటు రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో ఏడుకొండలపై భారీగా భక్తుల రద్దీ నెలకొంది. దీంతో టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు పాలు, టిఫిన్ వంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

Read Also: Amit Shah: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వైజాగ్ లో అమిత్ షా పర్యటన..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి భక్తులు వెలుపల క్యూ లైనులో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అయితే మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. 14వ తేదీన మొదటి ఘాట్ రోడ్డు ఏడోవ మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద మహశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఘాట్ రోడ్లులో ప్రమాదాల నివారణకు యాగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో తరుచుగా ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Show comments