Guntur: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్. ఇది మర్చిపోయి నేను ఎం చేసిన అడిగేవాళ్ళే లేరు నాకేంటి అని రెచ్చిపోతే. నువ్వెంటి నీ తల్లో జేజమ్మ కూడా చట్టానికి తలవంచక తగప్పదు అంటారు అధికారులు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ ఎం అయిందా? అనేగా మీ సందేహం.. లాడ్జిలో తప్పుడు పనులను చేసే వాళ్ళని బుక్ చెయ్యాల్సిన కానిస్టేబుల్ తానే యువతితో రాసలీల సాగిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరులో శ్రీనివాస రావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
Read also:Mumbai Crime: తెలంగాణలో విషం కొంది.. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది..
ఇతనికి ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే శ్రీనివాస రావు మరో యువతితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య భర్తలకు తరుచు వాగ్వివాదాలు జరుగుతుండేవి. భార్య ఎన్ని సార్లు అడిగిన అలాంటిది ఏమి లేదని బుకాయించేవాడు శ్రీనివాస్. కాగా ఓ లాడ్జిలో శ్రీనివాస్ రావు యువతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాస్ రావు భార్య, బంధువులు. వెంటనే భార్య, బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లాడ్జిలో ఉన్న శ్రీనివాస్ రావుని అలానే యువతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.