తిరుమలలో ఆన్ లైన్ టిక్కెట్లు కేటాయింపులో గందరగోళం నెలకొంది. టీటీడీ కాల్ సెంటర్ కి భక్తుల ఫిర్యాదుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ మాసంకు సంభందించిన 2 లక్షల 40 వేల… 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును నిన్న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించింది టీటీడీ. 9.30 గంటల వరకు సైట్ ఒపెన్ కాలేదంటు భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. 9.30 గంటలకే 90 శాతం టిక్కెట్లు విక్రయాలు పూర్తి అయ్యాయి. అటు తరువాత సైట్ ఒపెన్ అయినా… సర్వర్ ప్రాభ్లమ్ తో భక్తులకు టికెట్లు దొరకలేదు. దాంతో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారంలో ఇంటి దొంగల చేతులాడండి ప్రదర్శిస్తూన్నారంటు ఆరోపిస్తున్నారు భక్తులు. అందువల్లే విచారణ జరిగితే అక్రమాలు వెలుగు చూస్తాయంటున్నారు భక్తులు.