Site icon NTV Telugu

చంద్రబాబు ఇంటిపై దాడి : గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు !

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌భవన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.వైసీపీనేతలు దాడికి పాల్పడుతున్న దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని కూడా వినతిపత్రంతో పాటు గవర్నర్‌ కార్యదర్శికి సమర్పించామన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కారు అద్దాలు పగులగొట్టారన్నారు జోగి రమేష్.చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు వార్నింగిచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇది ఆరంభం మాత్రమే అన్నారు జోగి రమేష్. అధికార పార్టీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు అయ్యన్నపాత్రుడు. ఇలాంటివి చాలా చూశామన్నారు. అవసరమైతే అరెస్టు అయ్యేందుకు కూడా సిద్ధమేనన్నారు. అధికార పార్టీ విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Exit mobile version