రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు.

red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

×
×
Ad

ఇక సీఎం జగన్‌ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్‌.