NTV Telugu Site icon

CM YS Jagan: టార్గెట్‌ @ 175.. టీడీపీ నియోజకవర్గాలపై సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: గత ఎన్నికల్లో తిరుగులేని విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ అదే దూకుడు చూపించడడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది.. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పట్టుఉన్న నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పంపై సమీక్ష నిర్వహించడానికే పరిమితం కాకుండా.. కుప్పంలోనూ పర్యటించి వరాలు కురిపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. ఓవైపు తమ ఎమ్మెల్యేలు ప్రతినిథ్యం వహిస్తోన్న స్థానాలపై కూడా సమీక్ష నిర్వహిస్తూ.. పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న ఆయన.. టీడీపీకి పట్టుఉన్న నియోజకవర్గాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు.

Read Also: Chinta Mohan: 2024 ఎన్నికల్లో ఊహించని పరిణామాలు.. ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో‌ బీఆర్ఎస్..

టార్గెట్ 175 దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తోన్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. టీడీపీ నియోజకవర్గాలపై కేంద్రీకరించారు.. అందులో భాగంగా ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు.. ఇవాళ సాయంత్రం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.. అయితే, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంది.. కానీ, ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.