NTV Telugu Site icon

CM YS Jagan: రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్‌.. పర్యటన వివరాలు ఇవే..

Vontimitta

Vontimitta

CM YS Jagan: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఐదవ రోజు మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కోదండ రాముడు.. ఇక, రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు ఒంటిమిట్ట రాముడు.. మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తుల సౌకర్యార్థం 118 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఏపీఎస్‌ ఆర్టీసీ.. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అనగా బుధవారం ఒంటిమిట్టను సందర్శించనున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చే సింది.. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్‌.. స్వామి వారిని దర్శించుకోనున్నారు..

Read Also: Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు

ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 5వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం.. 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ఆయన.. మళ్లీ టీటీడీ అతిథి గృహానికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు.. ఇక, సాయంత్రం 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం.. సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన దృష్ట్యా.. కడప జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.

Show comments