NTV Telugu Site icon

ఏపీలో మరో కొత్త పథకం.. శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్‌.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం డబ్బులను వసూలు చేసింది..

Read Also: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అక్కడ ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్‌..

తణుకులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా కొనసాగనుంది.. 21వ తేదీన ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న ఆయన.. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు ఏపీ సీఎం.