Site icon NTV Telugu

CM YS Jagan: విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కరెంట్‌ కోతలు, వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సమీక్ష జరిపారు సీఎం.. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో.. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు వినియోగం అంచనా వేస్తున్నారు.. ఇక, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. దీంతో, పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

సమీక్ష సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన.. కరెంటు కోతల సమస్య రాకూడదన్నారు.. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. వ్యవసాయ కనెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో కనెక్షన్‌ మంజూరు చేయాలని.. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.06లక్షల కనెక్షన్ల మంజూరు చేసినట్టు వెల్లడించిన సీఎం.. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేయనున్నట్టు తెలిపారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి అయినట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version