NTV Telugu Site icon

క‌రోనాపై సీఎం జ‌గ‌న్ కీల‌క కీల‌క స‌మీక్ష‌…

క‌రోనా మ‌హమ్మారిపై ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న సమీక్ష జ‌రిగింది.  ఈ సమీక్షా స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చర్చ జ‌రిగింది.  ఆక్సీజ‌న్ కొర‌త‌, క‌రోనా థ‌ర్డ్ వేవ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు తదిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించారు.  క‌రోనా క‌ట్ట‌డికి అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కూడా సీఎం ఆరా తీశారు.  ఈనెల 16 వ తేదీనుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతుండ‌టంతో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.  ఉపాద్యాయులంద‌రికీ వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  ఆక్సీజ‌న్‌, మందుల కొర‌త లేకుండా చూడాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు.  రాష్ట్రంలో ప్ర‌తిరోజు వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  గ‌తంతో పోల్చుకుంటే ఈ కేసులు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచిఉన్న దృష్ట్యా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  నిబంధ‌న‌ల‌ను వీలైనంత వ‌ర‌కు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. 

Read: న‌యా ట్రెండ్‌: పెళ్లిళ్ల‌లో పూల మాస్కులు…