NTV Telugu Site icon

Lay Foundation Stone For Steel Plant: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్‌.. స్టీల్‌ ప్లాంట్‌కు భూమి పూజ…

Ys Jagan

Ys Jagan

Lay Foundation Stone For Steel Plant: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్‌ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఇక, ఉదయం 11.10 – 11.30 జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలిపి పాల్గొంటారు సీఎం జగన్‌.. అలాగే శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11.45 – 12.45 మధ్య స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు.

Read Also: Woman Birth to Five Children: ఏడుగురి తర్వాత.. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం

ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి పులివెందుల చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్‌.. మధ్యాహ్నం 2 – 2.15 గంటల మధ్య పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగే మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు ఏపీ సీఎం.. మధ్యాహ్నం 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కాగా.. ఏడాదిలో 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరించనున్నారు.. ఇలా రెండో దిశల్లో మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తీసుకురానున్నారు.