Site icon NTV Telugu

YS Jagan Mohan Reddy: వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం సమీక్ష.. ఇలా చేయండి..

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేశారు.. ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలని.. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు. ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలన్న ఆయన.. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలన్నారు.. ఈ సందర్భంగా వైయస్సార్‌ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను సీఎంకు అందించారు అధికారులు. 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవకింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి కాగా.. 1615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేశారు. 690.87 కోట్ల విలువైన పరికరాలు అందించింది ప్రభుత్వం. ఇందులో 240.67 కోట్ల సబ్సిడీ అందించింది సర్కార్.

Read Also: Ganesh Nimajjanam 2022: వారికి శుభవార్త.. వీరికి మాత్రం బ్యాడ్‌ న్యూస్‌..

ఇక, మిగతా ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశారు.. సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి.. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. దీని కోసం రూ.1325 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లుగా ఉంది.. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని.. వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని.. అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని.. చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలని, వారికి పశువులను పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలని సూచించారు.. దీని వల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్నారు సీఎం వైఎస్‌ జగన్.

ఆమూల్‌పై సమీక్ష
అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్నారు సీఎం వైఎస్‌ జగన్.. అమూల్‌ పాలసేకరణపై కూడా సమీక్ష నిర్వహించిన ఆయన.. 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ జరుగుతోంది.. ఇప్పటి వరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ చేశాం.. పాల సేకరణ వల్ల ఇప్పటి వరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా 20.66 కోట్ల లబ్ధి చేకూరినట్టు తెలిపారు.. అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు.. ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి వనగూరిందని.. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్‌ పాల సేకరణ విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరగాలన్నారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు సీఎం జగన్.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు సీఎం.. ఫేజ్‌–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు. ధాన్యం సేకరణపై కూడా సమీక్ష జరగగా.. మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు.. సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌరసరఫరాల శాఖ. వీటిని సీఎంకు వివరించారు.. దీని కోసం విధి విధానాలు రూపొందించిన పౌరసరఫరాల సంస్థ. ధాన్యం సేకరణలో వాలంటీర్లను భాగస్వామ్యంచేయనున్నారు.. వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు ఇవ్వనున్నారు. ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version