NTV Telugu Site icon

CM YS Jagan: ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం

Ys Jagan Rtc Bus Accident

Ys Jagan Rtc Bus Accident

CM YS Jagan Mohan Reddy Condolences RTC Bus Accident: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయింది. అయితే.. బస్సు వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి, పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బందితో పాటు ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రికి తెలియజేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైదన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. అలాగే.. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.

2000 Notes Fraud: 2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసం.. రూ.18 లక్షలు స్వాహా

కాగా.. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడకు వెళ్లేందుకు ఓ పెళ్లి బృందం ఆర్టీసీ బస్సుని అద్దెకు తీసుకున్నారు. మొత్తం 40 మంది ప్రయాణికులు ఈ బస్సులో బయలుదేరారు. రహదారి ఖాళీగా ఉంది కదా అని, డ్రైవర్ వేగంగా బస్సుని నడిపించాడు. అయితే.. దర్శి సమీపంలోకి రాగానే, ఎదురుగా సడెన్‌గా ఓ వాహనం వచ్చింది. దాన్ని తప్పించబోతుండగా, బస్సు అదుపు తప్పి, ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు తలక్రిందులుగా పడటంతో.. ఒకరిపై మరొకరు పడి ఊపిరాడక 7 మంది మరణించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా.. ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సమాచారం అందుకొని.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

NIA Raids: ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని 5 చోట్ల ఎన్‌ఐఏ దాడులు