CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించబోతున్నారు.. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకాబోతున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇస్తారు అనే చర్చ సాగుతోంది.. గతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. మరోవైపు.. మంత్రివర్గంలో మార్పులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశంలోనే.. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడంతో.. ఆ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నేతలకు టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది.. కేబినెట్‌లో మార్పులు తప్పవా? అనే చర్చ సాగుతోంది.. దీంతో.. ఇవాళ్టి సమావేశంలో ఏం జరగబోతోంది? అనే టెన్షన్ మొదలైంది.. అయితే, వైసీపీ సీనియర్ నేతలు మాత్రం.. గతంలో జరిగిన విధంగానే గడపగడపకు సమీక్ష ఉంటుంది అంటున్నారు.. మంత్రి వర్గ విస్తరణ ఉండబోదు.. ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోరు అని కూడా చెబుతున్నారు.. అయితే, నేతల్లో మొత్రం.. ఈ సారికి మేం సేఫా..? లేదా? అనే టెన్షన్ మాత్రం కొనసాగుతూనే ఉందట..