ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంది.. అందులో భాగంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధత సమావేశం నిర్వహించారు.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయ్యారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతోన్న ఈ సమావేశంలో.. ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం పై చర్చ సాగుతోంది.. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టడం, నేతల మధ్య సమన్వయం ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ప్రజల్లోకి ఏ రకంగా వెళ్లాలి అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం.
Read Also: Minister KTR : కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం
ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని కీలక సూచనలు చేశారు సీఎం జగన్.. నేతల పని తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని సీఎం చెప్పే అవకాశం ఉండగా.. నేతలు తమ పని తీరు మెరుగు పరచుకోకపోతే ఇబ్బందులు ఉంటాయని చెప్పే అవకాశం కూడా ఉందంటున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుకెళ్లే విధంగా మంత్రులు, జిల్లా అధ్యక్షులు చూసుకోవాలని సూచనలు చేయనున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమం ఎంత అందుతోంది? సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు తెలుసుకునేల ప్రణాళికలు? త్వరలో సీఎం జిల్లాల పర్యటనలు, జూలైలో పార్టీ ప్లీనరీ పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. మొత్తంగా కొత్త కేబినెట్ ఏర్పాటు, మంత్రుల ప్రమాణస్వీకారం.. కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ఇలా.. పార్టీ పటిష్టత, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.