రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ లేఖలో వివరించారు. ఏపీలో 30లక్షల మందికి ఇళ్ల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు లేఖలో సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలికసదుపాయాలు కల్పించాలని లేఖలో సీఎం జగ్ పేర్కొన్నారు.
ప్రధాని మోడికి సీఎం జగన్ లేఖ…
