గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా చర్చించిన సీఎం… గడప గడపకూ మన ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి మంత్రి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన ఆయన.. ఎవరైనా పథకాలు అందలేదంటే వారికి ఓపిగ్గా వివరణ ఇవ్వాలన్నారు. కొంతమంది ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అని పరోక్షంగా ప్రస్తావించిన సీఎం జగన్.. టీడీపీ మీడియాలో వచ్చే వార్తల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Also: Viral: ఎయిర్‌పోర్టులో తప్పించుకున్న శునకం.. సిబ్బందికి చుక్కలు..!
దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు లేవన్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులకు పథకాలు అందకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఓట్లతో సంబంధం లేదు… మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు జనానికి చెప్పాలని సూచించారు. లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఎంత మేలు చేశామో లెక్కలు చెప్పాలన్న ఆయన.. జనంలో ఉంటే మీరే గెలుస్తారని స్పష్టం చేశారు. కాగా, సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇల్లులూ తిరుగుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను.. వనగూరిన ప్రయోజనాలను వివరిస్తున్నారు.
