Site icon NTV Telugu

CM YS Jagan: అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనంపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

Cm Ys Jagan

Cm Ys Jagan

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.. 81 అడుగుల విగ్రహ పీఠం, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టుకు మొత్తంగా రూ.268 కోట్లు ఖర్చు చేస్తోంది.. పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం.. ప్రాంగణంలోనే ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగిస్తున్నారు.. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేసేలా ప్లాన్‌ చేశారు.. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..

Read Also: Diabetes : ఫిజియోథెరపీ ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చా..?

ఇక, దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం సాగుతోంది.. కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తూ ప్లాన్‌ రూపొందించారు.. అంబేద్కర్‌ స్మృతి వనానికి దారి తీసే రోడ్లను సందరంగా ముస్తాబు చేయనున్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చే శారు.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసిన ఆయన.. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని.. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Exit mobile version