Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Gives Clarity On Rumours Of Early Elections And Cabinet Expansion

CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌

Published Date :April 3, 2023 , 2:18 pm
By Sudhakar Ravula
CM YS Jagan: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య అనేక విషయాలపై ప్రచారం సాగుతోంది.. ఓవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. మరోవైపు కేబినెట్‌ విస్తరణ ఉందని.. ఎప్పుడైనా జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. ఇలా అనేక అంశాలపై రూమర్స్‌ వస్తున్నాయి.. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంపై చేపట్టిన సమీక్షా సమావేశంలో వీటిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఏపీలో రాజకీయ పరిణామాలపై రూమర్లను కొట్టిపారేసిన ఆయన.. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్నారు.. మంత్రుల మార్పు సహా ఇతర రూమర్ల పై ఎమ్మెల్మేలతో చర్చించిన ఆయన.. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు చాలా వస్తాయని.. వాటిని తిప్పికొట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ కార్యకర్రమంపై సమీక్ష జరిగింది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఇతర నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం.. దాని తర్వాత కార్యక్రమానికి కాస్తగ్యాప్‌ వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చిందని.. మార్చి 16వరకూ కోడ్‌ కొనసాగింది.. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి.. దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్‌ వచ్చిందన్నారు సీఎం..

అయితే, మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలన్న ఆయన.. రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్‌లో పడిందన్నారు. అర్బన్‌ ప్రాంతంలో 84శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం.. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదన్నారు. 87 శాతం కుటుంబాలను గమనించినట్టైతే.. అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశామని.. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసిన మరీ.. వారికి పథకాలు అందిస్తున్నాం.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చామని తెలిపారు.

బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం.. ఇలా, చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.. 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే, 17 స్థానాల్లో మనం గెలిచాం.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం అన్నారు.. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు.. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి.. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి.. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు.. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుందని.. ఆ పరిధిలో 87శాతం అంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయని.. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు.. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందిన వారు.. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో.. వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువగా ఉన్నారని.. ఎమ్మల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు 80 శాతం మంది డీబీటీలో లేనివారు.. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని.. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎలక్టోరల్‌ రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు.. ఒకటి, రెండో, మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి.. మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరమే.. అయినా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలవ లేదన్నారు సీఎం జగన్‌.. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది.. అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు.. దానికితోడు కొన్ని మీడియా, ఛానెళ్లు చూపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు.. 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెప్తారు.. ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.. ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు.. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి.. అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. వారంతా గజ దొంగల ముఠా.. దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది… అందుకే గజ దొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి.. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి.. వాటిని తిప్పికొట్టాలి.. సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం.. కేడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి.. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి.. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Cabinet Expansion
  • CM YS Jagan
  • Early elections
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions