Site icon NTV Telugu

CM YS Jagan: సీఎం జగన్‌ శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని; సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అభిలషించారు. శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. కాగా, తెలుగు లోగిళ్లలో ఈ నెల 22వ తేదీన అంటే బుధవారం ఉగాది పండుగను జరుపుకోనున్న విషయం విదితమే. రాష్ట్రంలోని ఆలయాల్లో ఉగాది వేడుకల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version