Site icon NTV Telugu

CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు.. ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలి

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.. ఇప్పటికే పట్నం వీడి పల్లె బాట పడుతున్నారు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలివెళ్తున్నారు.. దీంతో, రోడ్లు, రైల్వేస్టేషన్‌, విమానాలు.. అన్నీ రద్దీగా మారిపోయాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్‌.. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని పేర్కొన్నారు..

Read Also: Carrot Juice : క్యారెట్‌ జ్యూస్‌ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని, పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version