Site icon NTV Telugu

YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. రీజనల్ కో ఆర్డినేటర్ నియామకంలో మార్పులు చేసింది.. కొంత మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించిన పార్టీ.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.. ఇక, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డిని వ్యవహరించనున్నారు.. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్‌ జగన్.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి రీజినల్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కో-ఆర్డినేటర్‌గా కొనసాగనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు.. మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల విషయంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది.

Exit mobile version