Site icon NTV Telugu

ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్న అథ్లెట్స్ కి విషెస్ చెప్పిన సీఎం జగన్‌

జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్‌ అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌… విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్‌ హకీ) చిత్తూరు జిల్లా, ఆమె బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Exit mobile version