ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక జగన్ చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు హాజరు కానున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వంలో ఎదురైన అనుభవాలను స్వయంగా పార్టీ బాధ్యుల నుంచే జగన్ తెలుసుకోనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలు, వాటిని ఎంత మేరకు పరిష్కరించారు వంటి అంశాలపై ఈ సమావేశంలో వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వివరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మరింత వేగంగా ప్రజల్లో్కి వెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Konaseema: కోనసీమ వాసులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే ఇంటర్నెట్ సేవలు
కాగా సీఎం జగన్, ఆయన భార్య భారతి ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం ఏకాంతంగా సమావేశమై సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. కోనసీమ అల్లర్లు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం అమరావతిలో టీటీడీ నిర్మించిన ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్‌ను జగన్ ఆహ్వానించారు. కాగా అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ ఆలయాన్ని నిర్మించారు.
