Site icon NTV Telugu

CM Jagan: పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Cm Jagan

Cm Jagan

ఏపీలో పరిశ్రమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచాలని సీఎం జగన్ అన్నారు. అమరావతిలో పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కాలుష్య నివారణపై జగన్ మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలన్నారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్య నివారణ వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధి అవసరం వుందన్నారు. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలన్నారు.

పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ద్వారా వాల్యూ అడిషన్‌ చేస్తున్నాం. గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా తయారీలపై దృష్టి పెట్టాం అన్నారు జగన్. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ముందడుగు వేస్తాం అన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలన్నారు సీఎం జగన్. ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Suriya: తాను నటించిన సినిమాలో గెస్ట్ గా కనిపిస్తున్న స్టార్ హీరో

Exit mobile version