Site icon NTV Telugu

జనవరిలోగా రెండో డోస్ పూర్తి కావాలి : సీఎం జ‌గ‌న్ ఆదేశాలు

కోవిడ్, వైద్యారోగ్యశాఖపై సీఎం జ‌గ‌న్ ఇవాళ‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. జనవ‌రిలోగా అందరికీ డబుల్‌ డోస్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్‌ నివారణలో ఉన్న పరిష్కారమ‌ని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని… గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్‌ పెట్టాలని వెల్ల‌డించారు. విలేజ్‌ క్లినిక్స్‌ రిఫరల్‌ పాయింట్ కావాలని.. విలేజ్‌ క్లీనిక్స్ అందుబాటులోకి వచ్చేంత వరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. క్యాన్సర్‌ రోగులకు సూపర్‌స్పెషాల్టీ సేవలు అందాలని… మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాల్టీ ఆస్పత్రులు ఉండాలని పేర్కొన్నారు. 108, 104 వాహనాలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని తెలిపారు.

Exit mobile version