Site icon NTV Telugu

పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యత పెంచాలి : సీఎం జగన్

cm jagan

విద్యాశాఖలో నాడు–నేడు, పౌండేషన్‌ స్కూళ్లుపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. అందులో సీఎం జగన్ మాట్లాడుతూ… నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధం కావాలి. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి అని సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్ల, టాయిలెట్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలి అని తెలిపారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్‌ ప్రతి స్కూల్లో ఉంచాలి. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలి అని పేర్కొన్నారు. అలాగే విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యంగా ఉండాలి. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేసారు.

Exit mobile version