NTV Telugu Site icon

Cm Jagan: ధాన్యం కొనుగోళ్ళపై జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan 1 (1)

Cm Jagan 1 (1)

ఏపీలో ధాన్యం కొనుగోళ్ళపై ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలిచ్చారరు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. ఖరీఫ్‌ నేపథ్యంలో ఇ– క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందన్నారు.

ఇ–క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి. ఇ–క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతో పాటు, ఫిజికల్‌ రశీదు కూడా ఇవ్వాలని గతంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలి. ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది. దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలి. వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జాయింట్‌ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి.

గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలన్నారు జగన్. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఇ–క్రాప్‌లో లోడ్‌ చేయాలి. జూన్‌ 15 నుంచి ఇ– క్రాపింగ్‌ మొదలుపెట్టి, ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలి. సెప్టెంబరు మొదటి వారంలో సామాజిక తనిఖీ చేపట్టాలి. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి. మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్‌ జరుగుతున్న తీరును తనిఖీచేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్ళ మిల్లర్ల పాత్ర తీసేయాలన్నారు.

ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి. ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు. ధాన్యం కొనుగోలు బాధ్యత పౌరసరఫరాల శాఖదే అన్నారు సీఎం జగన్. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి. దీనివల్ల రైతుకు ఎంఎస్‌పీ లభిస్తుంది. రావాల్సిన ఎంఎస్‌పీలో ఒక్క రూపాయి కూడా రైతుకు తగ్గకూడదు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారి పక్షాన నిలవాలి. వారి వైపు నుంచే మనం ఆలోచించాలి. పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన నిలవాలన్నారు జగన్.

Gudivada tension: ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..గుడివాడలో టెన్షన్