రేపు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో సీఎం జగన్ పర్యటన వుంటుంది. గుమ్మళ్ల దొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి హెలిప్యాడ్ వద్దకు బయలు దేరనున్న సీఎం…ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
Read ALso: Israel: ఇజ్రాయిల్ ప్రధానిగా నెతన్యాహు.. విజయం దాదాపుగా ఖరారు..
పరిశ్రమ శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్.. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లుచేశారు. గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న అస్సాగో ఇథనాల్ శుద్ది కర్మగారం నిర్మాణానికి భూమి పూజ జరగనుండడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత భూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తదుపరి బహిరంగ సభలో ప్రజలను, ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి. రూ.260 కోట్లతో ఈ కంపెనీ రావడం ద్వారా స్థానికంగా 300 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. భౌగోళికంగా, సామాజికంగా గోకవరం మండలం ఆర్థిక అభివృద్ధి పై వాటి ప్రభావం వుంటుందని భావిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి రావడం ఇది ఐదవ సారి. ఈ సభలో సీఎం ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను ముడిసరుకు గా వినియోగం. తొలుత 200 కిలోలీటర్ల సామర్ధ్యంతో ప్రారంభం కానుంది. వికేంద్రీకరణతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి దోహదం అవుతుందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.
Read ALso: Kantara Update: బాక్సాఫీసును కొల్లగొడుతున్న కాంతార.. 300 కోట్లకి పైగా వసూళ్లు