CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి రుణ పరిమితి పెంపుపైన కూడా ప్రధానిని అడిగినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు ఏపీకి ప్రత్యేక హోదా, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్ ఇతర విభజన సమస్యలు తదితర అంశాలపై కూడా ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు.
Read Also: ప్రపంచంలో నివాసయోగ్యమైన టాప్-10 నగరాలు ఇవే..
ఇవి కాకుండా రాజకీయ పరమైన అంశాలపై కూడా ప్రధాని మోదీ, సీఎం జగన్ కాసేపు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో భేటీ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం అవుతారు.
