NTV Telugu Site icon

Jagan Davos Tour: దావోస్‌లో గౌతమ్ ఆదానీతో జగన్ భేటీ.. ఫోటోలు

Jagan Davos Tour

Jagan Davos Tour

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. తొలుత ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి శ్యాం బిషేన్‌తో సమావేశమై ఆరోగ్య రంగంలో పెట్టుబడులపై వివరించారు.

అటు డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం జగన్ సమావేశమై డబ్ల్యూఈఎఫ్‌లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం జగన్‌ను మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం జగన్‌తో అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సమావేశమై పలు అంశాలను చర్చించారు.

మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతో జగన్